శ్రీలంక సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ కు అంతర్జాతీయ క్రికెట్ లో దురదృష్టం వెంటాడుతుంది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔటైనా ఈ శ్రీలంక స్టార్ బ్యాటర్.. తాజాగా మరోసారి ఊహించని రీతిలో ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టి చివరకు హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ ఆసాంతం ఎంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన మాథ్యూస్.. ఈ రకంగా అవుట్ కావడంతో నెటిజన్స్ ఈ లంక ఆల్ రౌండర్ పై జాలి చూపిస్తున్నారు.
శ్రీలంక ఇన్నింగ్స్ 102 ఓవర్ రెండో బంతిని స్పిన్నర్ క్వయిస్ అహ్మద్ దూరంగా విసిరాడు. లూజ్ గా వచ్చిన బంతిని మాథ్యూస్ వెంటాడి బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ దశలో వెనక్కి తిరిగి ఆడటంతో బ్యాట్ తో వికెట్లను తాకింది. దీంతో హిట్ వికెట్ గా వెనుదిరగాల్సి వచ్చింది.
వరల్డ్ కప్ లో భాగంగా మాథ్యూస్ వివాదాస్పద రీతిలో ఔటైన సంగతి తెలిసిందే. ఐసీసీ నియమాల ప్రకారం ఒక బ్యాటర్ ఔటయ్యాక.. కొత్తగా వచ్చే ఆటగాడు 2 నిమిషాల్లోపే క్రీజులో ఉండాలి. కానీ ఈ రూల్ అతిక్రమించిన శ్రీలంక ఆల్ ఆల్ రౌండర్.. హెల్మెట్ సరిగ్గాలేదనే కారణంతో ఆలస్యం చేసాడు. దీంతో నిర్ధేశించిన సమయంలోపు అతడు బంతిని ఎదర్కోనందుకు అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు.
కుశాల్ మెండిస్ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మాథ్యూస్.. 141 పరుగులు చేసి లంకకు భారీ స్కోరును అందించాడు. మాథ్యూస్ తో చండీమాల్(107) సెంచరీ కొట్టడంతో తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 439 పరుగులకు ఆలౌటైంది. దీంతో లంకకు తొలి ఇన్నింగ్స్ లో 241 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ 198 పరుగులకే ఆలౌటైంది.
Angelo Mathews, facing tough luck ☹️?? #SLvsAFG pic.twitter.com/RDs353Bqy9
— Cricunit (@cricunit) February 4, 2024