అధికారుల తీరుపై ఆగ్రహం : కలెక్టర్ ​వి.పి. గౌతమ్​

  •     హాస్పిటల్ బిల్డింగ్ పనులుస్పీడ్ అప్ చేయాలి 
  •      కేజీబీవీ తనిఖీ చేసిన కలెక్టర్​వి.పి. గౌతమ్​

ఎర్రుపాలెం, వెలుగు : మండల పరిధిలోని బనిగండ్లపాడు పీహెచ్‌సీ బిల్డింగ్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ వి.పి గౌతం పరిశీలించారు. 9 నెలలైనా బిల్డింగ్​నిర్మాణం పూర్తి చేయలేదని కాంట్రాక్టర్ కృష్ణారావు పై అసహనం వ్యక్తం చేశారు.  అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. బిల్డింగ్ ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా కరెంటు లేకపోవడమేంటని ఎస్ ఓ సరిత పై మండిపడ్డారు. ఎంఈఓ ప్రభాకర్ తో మాట్లాడుతూ సంవత్సరానికి ఎన్ని స్కూళ్లను విజిట్ చేస్తారని ప్రశ్నించారు. ఏడీఏ అనురాధ తో మాట్లాడుతూ  స్కూల్ బిల్డింగ్ కు విద్యుత్ సరఫరా అందించాలని కోరారు. 

అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.  బాత్రూములు అపరిశుభ్రంగా ఉన్నాయని వెంటనే అడిషనల్ బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలని డీఈవో సోమశేఖర్ శర్మకు ఆదేశాలు జారీ చేశారు. మండల కేంద్రంలో పేదలకు అందించే ఇంటి స్థలాలను తహసీల్దార్​ ఉశా శారద తో కలిసి పరిశీలించారు.  

విద్యార్థులు కష్టపడి చదవాలి

మధిర:  ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్​ విపి గౌతమ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన- ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయల కోసం కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారని.. తల్లిదండ్రులు వీటిని గమనించి పిల్లలను ప్రభుత్వ స్కూల్స్​కు పంపించాలన్నారు. పాఠశాల నూతన భవన నిర్మాణం లో స్థల సేకరణకు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి, గ్రామస్థులకు  అభినందనలు తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజు, రాష్ర్ట విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ కొండబాల కోటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ అభినవ్ , ఎంపీపీ  మెండెం లలిత, జిల్లా విద్యాశాఖాధికారి  సోమశేఖర్ శర్మ, మధిర ఎంఈఓ ప్రభాకర్, మధిర ఎంపీడీవో సిలార్ , సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ, ఎంపీటీసీ సామినేని సురేశ్ , డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, పంచాయతీ రాజ్ డీఈ  కెవికె శ్రీనివాస్ పాల్గొన్నారు.