
కామారెడ్డి జిల్లా: వరి రైతుల ఆగ్రహం మరోసారి కట్టలు తెంచుకుంది. తమ పరిస్థితి కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్లు తయారైందంటూ ఎల్లారెడ్డి మండలం శివనగర్ గేటు ప్రాంతంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి ధర్నా చేశారు. కష్టపడి పండించిన పంటను ధాన్యం బస్తాలుగా చేసి లారీల్లో రైస్ మిల్లులకు తీసుకొస్తే.. ఇక్కడ దోపిడీ చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక లారీ లోడుకు 8 సంచులు తరుగు తీస్తున్నారని వారు ఆరోపించారు. ఇదేమని అడిగితే లారీల కొరతతో ఇబ్బందులున్నాయని.. ఎక్కువ మాట్లాడితే సన్నరకం సరుకు మాకొద్దని అంటున్నారని రైతులు వాపోయారు. సన్న రకం వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై పోసి నిప్పు అంటించి నిరసన తెలియజేశారు.
Read more News…