కేటీఆర్ ఇలాకాలో ట్రాక్టర్ యజమానుల గుస్సా

కేటీఆర్ ఇలాకాలో ట్రాక్టర్ యజమానుల గుస్సా

మేం ర్యాలీకి రాం!

22న ర్యాలీ ప్రకటించి రద్దు చేసుకున్న టీఆర్ఎస్ నేతలు
నేడు సిరిసిల్లలో 500 ట్రాక్టర్లతో ర్యాలీకి ఏర్పాట్లు
ట్రాక్టర్ యూనియన్ లీడర్లతో కేటీఆర్ మేనబావ బుజ్జగింపులు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు తీస్తున్నారు. కానీ కేటీఆర్​ నియోజకవర్గంలో మాత్రం ర్యాలీ సక్సెస్​కోసం టీఆర్ఎస్​నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నెల 22న సిరిసిల్లలో 500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని టీఆర్ఎస్​నేతలు అనుకున్నారు. ఆ మేరకు ఈ నెల 21న ప్రకటించారు. అయితే సిరిసిల్ల ట్రాక్టర్​యజమానులు సహకరించకపోవడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఎలాగైనా సిరిసిల్లలో భారీ ర్యాలీ నిర్వహించి పరువు దక్కించుకునేందుకు గురువారం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో ఇంటర్నల్​ సమావేశం ఏర్పాటు చేశారు. ట్రాక్టర్​యజమానులు ర్యాలీని వ్యతిరేకించడానికి కారణాలు చర్చించారు. సిరిసిల్ల స్థానిక అవసరాలకు ఇసుక ఇవ్వకపోవడమే కాకుండా వారానికి ఒకరోజు ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చి పోలీసులతో వేధింపులకు గురిచేయిస్తుండడంపై ట్రాక్టర్​ డ్రైవర్లు, యజమానులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మీ ర్యాలీకి మేం బండ్లు పెట్టం అంటూ ట్రాక్టర్​ యజమానులు తెగేసి చెప్పడంతో వారిని బుజ్జగించేందుకు కేటీఆర్​ మేనబావ, టీఆర్ఎస్​ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావ్, పార్టీ జిల్లా ఇన్​చార్జి తోట ఆగయ్య, జిందం చక్రపాణి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసి మండలాల వారీగా ట్రాక్టర్​యజమానులతో మాట్లాడారు. ఎలాగైనా సరే శుక్రవారం 500 ట్రాక్టర్లతో ర్యాలీ తీసేందుకు సన్నద్ధమయ్యారు.

For More News..

ఇయ్యాల భారత్ బంద్

పవర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అంత ఈజీ కాదు