మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ కు రంగం ప్రారంభం కానుంది. నవంబర్ 24,25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ మెగా ఆక్షన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రయల్స్‌లో యువ క్రికెటర్ అంగ్క్రిష్ రఘువంశీ కనిపించాడు. గత సీజన్ లో కేకేఆర్ తరపున ఆడిన ఇతను ఇప్పుడు ఆర్సీబీ క్యాంపులో కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. 19 ఏళ్ళ ఈ బ్యాటర్ ను ఆర్సీబీ టార్గెట్ చేసిందని.. అతని యువ ప్రతిభను గుర్తించి అతన్ని బెంగళూరు జట్టు తీసుకోబోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2024లో అంగ్క్రిష్ రఘువంశీ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే అదరగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. 27 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి....ఐపీఎల్ హాఫ్ సెంచరీ కొట్టిన యంగెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. 18 ఏళ్ళ వయసులో ఈ కుర్రాడు చూపిన ఆటకు ఫిదా కానివారు.. బహుశా ఎవరూ ఉండరేమో. గ్రౌండ్ లో అన్ని రకాల షాట్స్ ఆడుతూ ఎంతో పరిణితి చూపించాడు. మొత్తం 10 మ్యాచ్‌ల్లో 163 పరుగులు చేయడంతో పాటు అతని హిట్టింగ్ సామర్థ్యంతో ఆకట్టుకున్నాడు.
Also Read:-బిడ్డ పుట్టాడు.. ఇంకా కుటుంబం ఏంటి?
ఎవరీ ఆంగ్‌క్రిష్ రఘువంశీ..?
రఘువంశీ ఢిల్లీకి చెందినవాడు. 2005 జూన్ 5న జన్మించాడు. తన చిన్న వయసులో ఐదేళ్ల పాటు ఆసుపత్రుల్లోనే గడిపాడట. దీని కారణం.. ఇతనికి కిషన్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పుడు కిషన్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. తమ్ముడిని చూసుకుంటూ ఆసుపత్రిలో ఉండటం...అక్కడే నిద్రపోవటం లాంటివి చేస్తూ చిన్న ఏజ్ లోనే చాలా కష్టపడ్డాడంట.
2022లో టీమిండియా అండర్ 19వరల్డ్ కప్ లో రఘువంశీ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 278 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ టోర్నీ తర్వాత సీకే నాయుడు ట్రోఫీలోనూ మెరవటంతో కోల్ కతా నైట్ రైడర్స్ రఘవంశీని వేలంలో కొనుక్కుంది. అతని ప్రతిభను ప్రపంచానికి చూపించిన ఘనత మాత్రం మెంటార్ గంభీర్ కే దక్కుతుంది. రఘువంశీ ఫియర్ లెస్ బ్యాటింగ్ ను గమనించిన గంభీర్.. నిన్న ఢిల్లీ మీద వన్ డౌన్ లో పంపించి ఆశ్చర్యపరిచాడు. 18 ఏళ్ల వయసుకే ఐపీఎల్ ఆడుతూ,.. ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ బాది తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.
🚨Angkrish Raghuvanshi spotted in #RCB Trials ahead of #IPL2025 Auction 👇 pic.twitter.com/0DM9uMD0IO
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) November 19, 2024