సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యేను అడ్డుకుందాం..మాల కులస్తుల తీర్మాణం

కోల్​బెల్ట్, వెలుగు: సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోని ఎమ్మెల్యే బాల్క సుమన్​ను అడ్డుకుందామని మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఊరుమందమర్రి 24 వార్డుకు చెందిన మాల కులస్తులు తీర్మానించుకున్నారు. తమ వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరించలేదని మండిపడ్డారు.

ఆదివారం ఆ వార్డుకు చెందిన మాల కులస్తులు, యువత, మహిళలు సమావేశమై వార్డులోని పలు సమస్యలపై చర్చించారు. గత ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాల్క సుమన్ సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చి పట్టించుకోలేదన్నారు. రానున్న  ఎన్నికల ప్రచారానికి వచ్చే ఎమ్మెల్యేతోపాటు ఇతర లీడర్లను ఐక్యంగా అడ్డుకుందామని తీర్మానించుకున్నారు.