AI యూజ్ చేసి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ.. హైకోర్టులో ANI దావా

ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ANI) ఓపెన్ AIపై దావా వేసింది. ఇండియాలో కాపీరైట్ చేసిన న్యూస్ కంటెంట్ ను AI కంపెనీలు  ఉపయోగించకునేందుకు ఓ విధానాన్ని రూపొందించాలని కోర్టును ఆశ్రయించింది ANI న్యూస్ ఏజెన్సీ. భవిష్యత్ లో కూడా ఏఐ సంస్థలు వార్తా సంస్థల కాపీరైట్ కంటెంట్ పై చట్టపరమైన పోరాటానికి ఇది దారితీసింది. ANI రైపీరైట్ కంటెంట్ ను వాడి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఏఐతో ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు సృష్టించారు. ఈ విషయంపై ANI సీరియస్ అయ్యింది. దీనిపై సోమవారం ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. మంగళవారం విచారణ జరిగింది. చాట్‌జిపిటి ఇకపై ANI వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయదని జస్టిస్ అమిత్ బన్సల్ OpenAIకి సమన్లు​జారీ చేశారు. 

ALSO READ | ఆధ్యాత్మికం : నిజమైన దేవుడు ఎలా ఉంటాడు.. భూమిపై అన్నింటి కంటే శక్తివంతమైన జీవి ఏది..?

వెంటనే ఓపెన్ ఏఐపై ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ ఏసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ కోరింది.. తక్షణ ఇంజక్షన్ ఆర్డర్  ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. తదుపరి కోర్టు సెషన్ జనవరిలో జరగనుంది. AI సంస్థలు కాపీరైట్ చేయబడిన కంటెంట్‌ను ఎలా ఉపయోగిస్తున్నాయనే దానిపై ప్రపంచవ్యాప్త విమర్శలను ఈ కేసు దృష్టికి తెచ్చింది.