DC vs SRH: ఆ ఇద్దరూ లేకపోతే సన్ రైజర్స్ ఇంకా దారుణంగా ఓడిపోయేదే!

DC vs SRH: ఆ ఇద్దరూ లేకపోతే సన్ రైజర్స్ ఇంకా దారుణంగా ఓడిపోయేదే!

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్ ను భారీ విజయంతో గ్రాండ్ గా ప్రారంభించితిన్ మన జట్టు.. ఆ తర్వాత రెండు మ్యాచ్ ల్లో ఘోరంగా పరాజయం పాలయింది. ఆదివారం (మార్చి 30) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మరో నాలుగు ఓవర్లు ఉండగానే ఛేజ్ చేయడమే ఇందుకు కారణం. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడిపోయినా యువ క్రికెటర్లు అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ ఆకట్టుకున్నారు. 

చితక్కొట్టిన అనికేత్ వర్మ:

37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ను అనికేత్ వర్మ నిలబెట్టాడు. ఏ బౌలర్ ను వదలకుండా ఆరంభం నుంచి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 41 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. ఈ 23 ఏళ్ళ బ్యాటర్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల ఉండడం విశేషం. అనికేత్ కొడుతుంటే మరో ఎండ్ లో క్లాసన్ చూస్తూ ఉండిపోయాడు. సన్ రైజర్స్ 150 పరుగుల మార్క్ చేరుకుందంటే అనికేత్ కారణం. అంతకముందు లక్నో సూపట్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ తన హిట్టింగ్ తో అలరించాడు. 13 బంతుల్లోనే 5 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. 

తొలి మ్యాచ్ లోనే జీషాన్ అదుర్స్:

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ స్పిన్నర్ ఆడమ్ జంపా లేకుండానే బరిలోకి దిగింది. దీంతో స్పిన్ భారాన్ని యువ స్పిన్నర్ జీషన్ పై పడింది. ఆడేది తొలి మ్యాచ్ అయినా అతని బౌలింగ్ అద్భుతం. నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ముగ్గురు స్టార్ బ్యాటర్లు కావడం విశేషం. పదో ఓవర్ లో డుప్లెసిస్,  ఫ్రేజర్-మెక్‌గుర్క్ వికెట్లు పడగొట్టిన అతను.. 12 ఓవర్ రెండో బంతికి రాహుల్ ను బౌల్డ్ చేయడం విశేషం. జీషన్, అనికేత్ వర్మ ఈ మ్యాచ్ లో లేకపోతే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ చరిత్రలోనే అతి పెద్ద ఓటమి పాలయ్యేది.

Also Read :  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. విశాఖ పట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ తేడాతో ఓడిపోయింది. టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా రెండో పరాజయం. బ్యాటింగ్ లో అనికేత్ వర్మ, బౌలింగ్ లో నీషన్ తప్పితే మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. మరోవైపు అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లలో మూడు వికెట్లను 166 పరుగులు చేసి గెలిచింది.