
Reliance Power: అనిల్ అంబానీ ఒకప్పుడు దివాలా తీసిన వ్యాపారవేత్తగా అందరికీ తెలిసిందే. సోదరుడు ముఖేష్ కొత్త కొత్త వ్యాపారాలతో వేగంగా దూసుకుపోతున్న సమయంలో దశాబ్ధకాలానికి పైగా అనిల్ మాత్రం పతనంతో బిజినెస్ ప్రపంచంలో చీకటి రోజులను చూశారు. కానీ ఇప్పుడు కొన్ని త్రైమాసికాలుగా తన కంపెనీల రుణాలను క్రమంగా చెల్లిస్తూ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కంపెనీలను తిరిగి లాభాల బాట పట్టిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
నేడు కూడా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ ఫ్రా కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో మార్కెట్లో దూసుకుపోవటంతో అనిల్ పేరు వార్తల్లో ప్రధానాంశంగా నిలిచింది. వాస్తవానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీని హిందూజా గ్రూప్ 9 వేల 6 వందల 50 కోట్లకు కొనుగోలు చేయటంతో అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ షేర్లు తిరిగి ప్రాణం పోసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో 11 శాతం పెరుగుదలను చూడగా.. గడచిన నెల కాలంలో 13.35 శాతం పెరుగుదలను చూశాయి.అలాగే గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లు 43 శాతం పెరుగుదలతో ఇన్వెస్టర్లకు భారీ రాబడులను తెచ్చిపెట్టింది. రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్ల డబ్బు రెండొందల శాతం పెరుగుదలను చూడటంతో మల్టీబ్యాగర్ రాబడులను వారు అందుకున్నారు.
Also Raed : 80% పెరగనున్న జున్‌జున్‌వాలా స్టాక్
అనిల్ అంబానీకి చెందిన మరో కంపెనీ అయిన రిలయన్స్ ఇన్ ఫ్రా స్టాక్ నిన్న 10 శాతం పెరిగింది. నెల రోజుల కాలంలో 14 శాతం పెరగగా.. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 21 శాతం పెరిగింది. మార్కెట్ల ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అంబానీ స్టాక్స్ మాత్రం ముందుకు కొనసాగటంతో ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.