టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ డిఆర్‌ఎస్ విషయంలో తనకు తానే సాటి. మైదానంలో బౌలింగ్ మార్పులు.. ఫీల్డింగ్ స్థానాలు మార్చడమే కాదు.. డిఆర్‌ఎస్ తీసుకునేటప్పుడు పకడ్బందీగా ఉంటాడు. ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే అతని నిర్ణయాలు సఫలం కావడం పక్కా అనేలా ఉంటుంది. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. తాజాగా మహేంద్రుడిపై ఏకంగా అంపైర్ అనిల్ చౌదరి సైతం ప్రశంసలు కురిపించాడు.
'2 స్లాగర్స్' పోడ్‌కాస్ట్‌లో అనీల్ చౌదరీ మాట్లాడుతూ.. "వికెట్ కీపర్‌లకు స్టంప్‌లకు అవతలి వైపు జరుగుతున్న సంఘటనలను ట్రాక్ చేయడం సాధారణంగా కష్టం. ధోని డిఆర్‌ఎస్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. అతని తీసుకునే నిర్ణయాలు కచ్చితత్వానికి దగ్గరగా ఉంటాడు. కొన్నిసార్లు వికెట్ కీపర్లకు బౌలర్ స్థానం కూడా కనబడదు. కానీ ధోనీ నిర్ణయాలు మాత్రం సఫలమవుతుంటాయి". అని ఆయన అన్నారు.
ALSO READ | Ashwin All-Time IPL XI: కెప్టెన్‌గా ధోనీ.. ఆల్‌టైం ఐపీఎల్ జట్టును ప్రకటించిన అశ్విన్
ఐపీఎల్ 2025 విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ ఆడతాడా లేదా అనే విషయంపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య జరగనున్న సమావేశం ధోనీ ఐపీఎల్ భవితవ్యం ఆధారపడి ఉంది. బీసీసీఐ 5 లేదా 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇస్తే మహేంద్రుడు 2025 ఐపీఎల్ ఆడతాడు. అలా కాకుండా ఎప్పటిలాగే నలుగురిని మాత్రమే తీసుకునే రూల్ కొనసాగితే ధోనీ 2025 ఐపీఎల్ ఆడకపోవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి.
Umpire Anil Chaudhary reacts on Dhoni Review System.. pic.twitter.com/Gew9YwOuel
— RVCJ Media (@RVCJ_FB) August 29, 2024