ఆదిలాబాద్ టౌన్, వెలుగు: సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి విస్మరించాడని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ విమర్శించారు. ఆదిలాబాద్కలెక్టరేట్ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు శనివారం ఆయన మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు రూ.50 వేల ఆర్థిక సహాయం చేశారు. బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఉద్యోగులతో ఫోన్లో మాట్లాడించారు. .
అంతకు ముందు ఉద్యోగులు కలెక్టరేట్ ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాయ్ తాగేంత లోపే జీవో ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఉద్యోగులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ అండగా నిలిచి పోరాడుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగులు, బీఆర్ఎస్నాయకులు పాల్గొన్నారు.