నేరడిగొండ, వెలుగు: నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త, నాయకుడు బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో దసరా పండుగ సందర్భంగా పలు మండలాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంగళవారం ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను గ్రామ గ్రామాన ప్రచారం చేయాలని, కష్టపడి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి , కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాజురా గ్రామంలోని జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనిల్‌జాదవ్ వెంట వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.