
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కీలక విభాగాలకు అధిపతులను సర్కారు నియమించింది. ఇన్నాళ్లూ ఈఎన్సీ జనరల్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈఎన్సీ అడ్మిన్ అనిల్ కుమార్‌ను.. పూర్తి స్థాయిలో ఈఎన్సీ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు ఈఎన్సీ అడ్మిన్ నుంచి ఈఎన్సీ జనరల్‌గా ట్రాన్స్ ఫర్ చేస్తూ బుధవారం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు గత ఫిబ్రవరిలో ఖాళీ అయిన ఈఎన్సీఓ అండ్ ఎం పోస్టునూ భర్తీ చేశారు. ఆదిలాబాద్ సీఈగా పనిచేస్తున్న టి.శ్రీనివాస్‌కు ఈఎన్సీఓ అండ్ ఎం, క్వాలిటీ కంట్రోల్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇటు అనిల్ కుమార్ ట్రాన్స్ఫర్తో ఖాళీ అయిన ఈఎన్సీ అడ్మిన్ పోస్టులో మహ్మద్ అంజద్ హుస్సేన్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన సీఈ (ఎంక్వైరీస్)గా పనిచేస్తుండగా.. ఇప్పుడు ఈఎన్సీ అడ్మిన్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.