ఈఎన్‌సీ జనరల్‌గా అనిల్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు

ఈఎన్‌సీ జనరల్‌గా అనిల్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ జనరల్‌గా ఈఎన్‌సీ గుమ్మడి అనిల్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.  ఇప్పటివరకు ఈఎన్‌సీ పరిపాలనా బాధ్యతలు చూస్తున్నారు అనిల్‌కుమార్.  అంతకుముందు ఈఎన్‌సీ జనరల్‌గా మరళీధర్ పనిచేశారు.  

ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో  అనిల్‌కుమార్ కు ఈ బాధ్యతలు అప్పగించింది.   శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకం అంచనా వ్యయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినందుకు గాను అనిల్‌కుమార్ ను  గత ప్రభుత్వం ప్రాధాన్యం లేని ఈఎన్‌సీ(అడ్మిన్‌) పోస్టులో కూర్చోబెట్టింది.  

 2013 జూన్ 30న ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ ఈఎన్సీగా రిటైర్డ్​అయిన మురళీధర్ అప్పటి నుంచి ఎక్స్‌‌టెన్షన్‌‌పై కొనసాగుతూ వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు సహా పలు కారణాలతో ఆయనను రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడంతో మురళీధర్ ఫిబ్రవరి 8న రాజీనామా చేశారు.