దేశ ప్రజలకు అమిత్ షా సారీ చెప్పాలి

 దేశ ప్రజలకు అమిత్ షా సారీ చెప్పాలి
  • బీజేపీది నియంత పాలన: ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్​పై అనుచిత కామెంట్లు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. అమిత్ షా మాట్లాడిన తీరును దేశ ప్రజలందరూ చూశారన్నారు. అంబేద్కర్​పై బీజేపీ.. ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ఆదివారం గాంధీ భవన్​లో మీడియాతో  ఆయన మాట్లాడారు. రాజ్యాంగం, ప్రజా స్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నదని ఫైర్ అయ్యారు.

బీజేపీది నియంత పాలన అని విమర్శించారు. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా.. బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. ‘‘సంధ్య థియేటర్ ఘటనలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిజాలే చెప్పారు.

శ్రీతేజ్​ను పరామర్శించాను. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటది. సినీ ప్రముఖులంతా అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నరు. కానీ.. రేవతి ఫ్యామిలీని ఎవరూ పట్టించుకోవడం లేదు. పేదలు అంటే అంత చిన్నచూపా? ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దనే సీఎం మాట్లాడారు. అల్లు అర్జున్​ను కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నడు. బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? అల్లు అర్జున్​ను బండి సంజయ్ సమర్థించడం సరికాదు’’అని ఆయన అన్నారు.