‘సంక్రాంతికి వస్తున్నాం’ డిస్ట్రిబ్యూటర్స్‌కి మెమరబుల్ చిత్రమని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. వెంకటేష్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా అనిల్ రూపొందించిన ఈ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఇప్పటికీ రన్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఇది ఒక మిరాకిల్. ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ వెంకటేష్ గారికి దక్కుతుంది.
ఆయన సపోర్ట్‌ని మర్చిపోలేను. ఈ సంక్రాంతి డిస్ట్రిబ్యూటర్స్‌కి మెమరబుల్‌గా నిలవడం హ్యాపీ. రీజినల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న రూ.300 కోట్ల గ్రాస్ నెంబర్ చూడబోతున్నందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. డిస్ట్రిబ్యూటర్స్ తలెత్తుకునేలా చేసిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్నారు.
ఈ చిత్రం తమకు ఐదారు రెట్లు ఆదాయం తెచ్చిందని, పదేళ్లుగా సరిపడా ఎనర్జీ ఇచ్చిందని, పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన లోకల్ సినిమా అని, మంచి సినిమా తీస్తే చూడ్డానికి రెడీగా ఉన్నామని ఆడియెన్స్ ప్రూవ్ చేశారని డిస్ట్రిబ్యూటర్లు ఎల్వీఆర్, రాజేష్, సాయి కృష్ణ, హరి, శోభన్ అన్నారు.