భగవంత్ కేసరిపై ఫేక్ రూమర్స్.. చూస్తేనే అర్థమవుతోంది.. అనిల్ సూపర్ కౌంటర్

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి(Anil ravipudi) తెరకెక్కించిన ఈ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ మూవీ. తొలివారంలో ఏకంగా రూ.112 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా.  

అయితే తాజాగా భగవంత్ కేసరి కలెక్షన్స్ పై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేకర్స్ చెప్తున్న లెక్కల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం సినిమాకు హైప్ తీసుకురావడం కోసమే ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు.

ALSO READ : సప్త సాగరాలు దాటి సైడ్ బి.. ఒకే టీజర్ లో 4 భాషలు.. కటింగ్ అదిరిపోయింది

భగవవంత్ కేసరి విషయంలో ఎలాంటి ఫేక్ కలెక్షన్స్ తాము ప్రకటించలేదని, తాము వేస్తున్న నంబర్స్ చాలా జెన్యూన్ అని, ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం అనిల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.