AnilRavipudi: సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్లలో @50 డేస్.. ప్రేక్షకులకు అనిల్ రావిపూడి స్పెషల్ థ్యాంక్స్

AnilRavipudi: సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్లలో @50 డేస్.. ప్రేక్షకులకు అనిల్ రావిపూడి స్పెషల్ థ్యాంక్స్

వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీ మరో అరుదైన రికార్డ్ సాధించింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అటు థియేటర్లు, ఇటు ఓటీటీలోను దుమ్ము రేపుతోంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏకంగా 92 సెంటర్లలో మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు తాజాగా (మార్చి 4న) ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ALSO READ | The Paradise Release: నాని ఆ సెంటిమెంట్ వదలడం లేదు.. అందుకేనా ఈ బ్లాక్ బాస్టర్ హిట్స్!

"92 సెంటర్లలో 50 రోజులు.. బ్లాక్‌బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పుతూ బాక్స్ ఫీస్‌ను శాసించడం కొనసాగిస్తోంది. క్రేజీ కామెడీతో థియేటర్లలో ప్రేక్షకులలో అసలైన పండుగను సజీవంగా తీసుకువచ్చింది. ఒక ప్రాంతీయ చిత్రానికి ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ రావడం ఎంతో గొప్ప విషయం" అంటూ నిర్మాణ సంస్థ వెల్లడించింది.

అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్లలో 50 డేస్ స్పెషల్ పోస్టర్ షేర్ చేస్తూ.. “నా తర్వాత మెగా ఎంటర్టైనర్ కోసం సిద్ధమవుతున్నాను. మరోసారి మీ అందరి ప్రేమ, మద్దతుకు థ్యాంక్యూ సో మచ్” అని అనిల్ రావిపూడి కోరారు. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మార్చి 1న జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టి రికార్డులు క్రియేట్ చేసే పనిలో ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమా ఐనా, ఒక వరం రోజులు థియేటర్లో ఉంటే అది మా ఎక్కువై పోయింది. కేవలం వసూళ్లను మాత్రమే పరిణగణలోకి తీసుకునే ఆచారం మొదలైంది. ఇది ఓ రకంగా సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదని భావన ఉన్నా.. నిర్మాతలకు డబ్బులు కూడా ముఖ్యమే కదా అని వినిపిస్తోంది. ఇది అటుంచితే.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజై రెండు నెలలు కావొస్తున్నా.. ఇంకా పలు థియేటర్స్ లో నడుస్తుండటం విశేషం.

అంతేకాకుండా.. థియేటర్స్ లో ఉండగానే ఓటీటీకి, టీవీల్లో రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా సాధించిన విజయం ఎలాంటిదో చెప్పుకోవాలంటే.. 'సినిమాను నిర్మించిన నిర్మాతల దగ్గర నుంచి, అది కొన్న డిస్ట్రీబ్యూటర్స్ వరకు లాభాలు తెచ్చిపెట్టి, తలెత్తుకునేలా చేసింది. 

నిర్మాతలకు వచ్చే లాభాల గురించి తెల్సిన ప్రేక్షకులు చాలా మందే ఉంటారు. కానీ, ఈ సినిమాతో ఫలానా ఏరియాలో ఒక డిస్ట్రీబ్యూటర్ ఉన్నాడు. అతను బాగా లాభం పొందాడు. అని గుర్తించుకునేలా చేసింది. ఇది కదా సక్సెస్ అంటే. ఇది కదా తెలుగు ప్రేక్షకులు అంటే. సినిమా నచ్చితే.. బ్రహ్మరథం పడుతారనే భావనకు ప్రాణం పోసింది సంక్రాంతికి వస్తున్నాం. ఇలాంటి సినిమాలు మున్ముందు రావడం సినీ పరిశ్రమకు ఎంతో మేలు.