యాదాద్రి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని ఆ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం భువనగిరి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు గడిచినా అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్గెలవడం ఖాయమని చెప్పారు.
తాను గెలవగానే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. ఈ సందర్భంగా భువనగిరి, బీబీనగర్, వలిగొండ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు యశోధ, రజిత సహా పలువురు బీఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.