ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర యానిమల్(Animal) ఫీవర్ ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిరోజులు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ ఉండసాగేది. అంతే మాదిరిగా ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి డిమ్రి (Tripti Dimri) హవా కూడా కొనసాగుతుంది.
ఈ బ్యూటీ యానిమల్లో కనిపించింది చిన్న పాత్రలో అయిన..తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో,రొమాంటిక్ సీన్స్తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాంతో త్రిప్తికి పాలోయింగ్ విపరీతంగా పెరగడంలో నేషనల్ క్రష్ గానూ గుర్తింపు సొంతం చేసుకుంది. ఒక్కో ప్రాజెక్ట్ కోసం కోట్లాది రూపాయల పారితోషికాన్ని ఈ బ్యూటీ అందుకుంటోంది.
మరోవైపు ఎప్పుకటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ యూత్ కి స్పెషల్ ట్రీట్ ని అందిస్తోంది. ఈసారి ఓ వైట్ టాప్ తో కూడిన లెహెంగాలో కాలు మీద కాలేసుకొని ఆమె ఇచ్చిన పోజులు వైరల్ అవుతున్నాయి. అందమైన డిజైనర్ పరికిణీ.. దానికి కాంబినేషన్ గా క్రీమ్ కలర్ బ్లేజ్ లో త్రిప్తి రియల్ స్టన్నర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె హెయిర్ కట్.. దానికి కాంబినేషన్ గా చేతులకు బరువైన డిజైనర్ గాజులు, కంకణాలతో తన లుక్ మరింతగా ఎలివేట్ చేసాయి..దాంతో తృప్తి డిమ్రి రాజసం కుర్రాళ్లని ఫిదా చేసేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
ALSO READ | Dussehra Movies: దసరాకు రిలీజ్ కానున్న మూవీస్ ఇవే.. థియేటర్లో జాతర మొదలైనట్టే
త్రిప్తి ప్రస్తుతం ఆషిఖ్ 3, ధఢఖ్ 2 సహా పలుసినిమాల్లో నటిస్తోంది. అలాగే స్టార్ హీరల సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ కి సంతకాలు కూడా చేస్తోంది. కాగా.. తన సహనటుడు రాజ్ కుమార్ రావుతో కలిసి నటించిన 'విక్కీ ఔర్ విద్యాకా నో వాలా' ఈనెల 11న థియేటర్లలో విడుదల కానుంది.