యానిమల్(Animal) సినిమాతో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri). నిజానికి ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది కానీ, ఆమెకన్నా ఎక్కువ క్రేజ్ త్రిప్తి కి రావడం విశేషం. చేసింది చిన్న పాత్రే అయినా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది త్రిప్తి. ఇక గ్లామర్ విషయంలో మాత్రం అస్సలు వెనుకాడలేదు. ముద్దు, సీడ్ సీన్స్ లో రెచ్చిపోయింది. అందుకే ఈ బ్యూటీ తరువాతి సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల త్రిప్తి డిమ్రి ముంబైలో ఖరీదైన బంగ్లా కొనిందట. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్, రేఖ, రణ్‌బీర్, ఆలియా వంటి స్టార్స్ ఉండే బాంద్రాలో తనకంటూ ఓ ఇంటిని సంపాదించుకుంది. సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉన్న రెండంతస్థుల విల్లాను దాదాపు రూ.14 కోట్లకు సొంతం చేసుకుందట త్రిప్తి. త్వరలోనే ఈ ఇంట్లోకి షిఫ్ట్ కానుందట. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక త్రిప్తి డిమ్రి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె విక్కీ విద్య కా వో వాలా వీడియో అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు భూల్ భులాయా మూవీకి సీక్వెల్‌గా వస్తున్న భూల్ భులాయా 3, బ్యాడ్ న్యూస్, ధడక్ 2 వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే థియేటర్స్ లోకి రానున్నాయి.