తెలుగు ప్రేక్షకుల ప్రేమకి ధన్యవాదాలు.. యానిమల్ బ్యూటీ ఎమోషనల్ వీడియో

ప్రస్తుతం దేశమంతా యానిమల్(Animal) మూవీ క్రేజ్ నడుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga), బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir kapoor) కాంబోలో వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ వైలెంట్ మూవీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం వారంరోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మూవీ. 

ఇక ఈ సినిమాలో రష్మిక(Rashmika) హీరోయిన్ అయినప్పటికీ చిన్న పాత్రలో కనిపించిన స్టార్స్ కు కూడా మంచి పేరు వస్తోంది అందులో తృప్తీ ధిమ్రీ ఒకరు. యానిమల్ సినిమా రిలీజైనప్పటి నుండి ఈ అమ్మడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా యానిమల్ సినిమా నుండి మరో బ్యూటీ నెట్టింట వైరల్ అవుతున్నారు. ఆ బ్యూటీ మరెవరో కాదు.. బాబీ డియోల్ కు భార్యగా చేసిన మాన్సీ తక్షక్(Mansi taxak). 

యానిమల్ సినిమాకు ముందు ఈ అమ్మడు గురించి ఎవరికీ సరిగా తెలియదు కానీ.. యానిమల్ రిలీజ్ తరువాత ఈ అమ్మడు ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో ప్రేక్షకుల నుండి, మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నుండి తనకు లభిస్తున్న ఆధరణ చూసి ఎమోషనల్ అయ్యారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా తెలుగు ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. ఆ వీడేమోలో  మాన్సీ తక్షక్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు.. అంటూ తెలుగులో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం మాన్సీ తక్షక్ తెలుగులో మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.