ఇప్పటికే రెండు పాటలతో ఇంప్రెస్ చేసిన ‘దేవర’ టీమ్, మూడో పాట విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది తెలిసిందే.తాజాగా దేవర థర్డ్ సింగిల్ దావుడి ప్రోమో రిలీజ్ చేశారు. గ్రిప్పింగ్ మ్యూజిక్ బీట్తో అదిరిపోయేలా ఉండబోతుందని అర్ధం అవుతోంది. ఈ పూర్తి పాటను ఇవాళ (సెప్టెంబర్ 4న) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
‘‘దావుడి’ అంటూ సాగే పాట కచ్చితంగా అదిరిపోతుంది, ప్రతీ బీట్ విజిల్ వేసేలా ఉంటుంది’ అంటూ ఓ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటనుబాలీవుడ్ క్రేజీ సింగర్ నకాష్ అజీజ్ పాడారు.శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేసారు.
Also Read:- తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి భారీ విరాళం
#Daavudi 🕺🏻💃🏻
— Anirudh Ravichander (@anirudhofficial) September 3, 2024
From 5:04PM Tomorrow!#Devara pic.twitter.com/m7Wzqgx9Ov
ఇదొక రొమాంటిక్ డ్యూయెట్ అని ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ 27న సినిమా విడుదల కానుంది.
నిజానికి దేవరకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు అని తెలిసినప్పటినుండి ఈ సినిమా రేంజ్ మారిపోయింది. కారణం..అనిరుధ్ నుండి వచ్చిన గత చిత్రాలే. ఆయన మ్యూజిక్ అందించిన విక్రమ్, లియో, జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అందుకే.. దేవర కోసం అనిరుధ్ అందించబోయే మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.