The Mystery of Moksha Island: ఓటీటీలో మోక్ష ఐలాండ్ మిస్ట‌రీ చూశారా.. తెలుగు సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే?

The Mystery of Moksha Island: ఓటీటీలో మోక్ష ఐలాండ్ మిస్ట‌రీ చూశారా.. తెలుగు సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే?

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచతం అనీష్ కురువిల్లా(Anish Kuruvilla). ఈయన పేస్ తెలిసిన ఆడియన్స్ కు పేరు అంతగా గుర్తుండకపోవొచ్చు.కానీ, అనీష్ దర్శకత్వం చేసిన సినిమాలు, నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి.

లేటెస్ట్గా అనీష్ కురువిల్లా దర్శకత్వం వహించిన సస్పెన్స్ హార‌ర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్” (The Mystery Of Moksha Island ).14 రీల్స్ ప్ల‌స్ ప‌తాకంపై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో దోసుకెళ్తోంది.

ఈ 8 ఎపిసోడ్ల థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్.. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో   హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ప్రియా ఆనంద్‌, నందు, తేజ‌స్వి మ‌దివాడ‌, రోష‌న్ క‌న‌కాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు హార‌ర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. 

కథేంటంటే::

నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా). ప‌దేళ్లుగా ప్ర‌పంచానికి దూరంగా నికోబ‌ర్ దీవుల్లోని మోక్ష ఐలాండ్‌లో సీక్రెట్‌గా ప్ర‌యోగాలు చేస్తుంటాడు. అనుకోకుండా ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. తాను సంపాదించిన వేల కోట్ల ఆస్తిని తన వార‌సులంద‌రికి పంచాల‌ని విశ్వ‌క్‌సేన్ నిర్ణ‌యించుకుని ఒక వీలునామా రాస్తాడు, ఆ ఆస్తి కోసం మోక్ష ఐలాండ్‌కు రావ‌ల్సిందిగా విక్కీ (నందు), ఝాన్సీ(ప్రియా ఆనంద్‌), మున్నా(అజ‌య్ క‌తుర్వార్‌)అదితితో (సోనియా అగ‌ర్వాల్‌) పాటు మ‌రికొంద‌రికి ఉత్త‌రాలు వ‌స్తాయి. అలా వారందరు ఒక్కొక్కరిగా ఐలాండ్ ద్వీపానికి వస్తారు. కానీ, వారం రోజులపాటు అక్కడే ఉండాలని విశ్వక్ ఒక రూల్ పెట్టాడని, అందుకు తాము పెట్టిన టెస్ట్‌ల‌కు పాసైన వ్య‌క్తికే విశ్వ‌క్‌సేన్ కంపెనీకి సీఈవో అవుతార‌ని మాయ (అక్ష‌ర గౌడ‌) ప్ర‌క‌టిస్తుంది.

Also Read : రాహుల్ గాంధీ ధైర్యవంతుడు

ఈ నేపథ్యంలో అక్కడే ఉంది టాస్క్ గెలవాలని సన్నద్ధమవుతున్న తరుణంలో ఒక్కొక్కరు మిస్ అవ్వడం జరుగుతుంది. మరి అక్కడున్న వారందరూ మిస్ అవుతున్నారా? లేదా చనిపోతున్నారా ? అనే మిస్టరీ నెలకొంటుంది. అందుకు తోడుగా ఒక వింత ఆకారంతో ఉన్న ఓ వ్య‌క్తి వారిని పలు విధాలుగా భయపెడుతూ వెంటాడుతుంటాడు. ఇక ఈ ఐలాండ్ మిస్ట‌రీని ఎలాగైనా ఛేదించాల‌ని విక్కీ, ఝాన్సీ నిర్ణ‌యించుకుంటారు. అయితే, ఈ మిస్టరీ ఐలాండ్ ద్వీపంలో శాస్త్రవేత్త విశ్వక్ సేన్ నిజంగానే ప్రయోగాలు చేసేవాడా? లేకా ఏదైనా దారుణాలకు పాల్పడేవాడా? అసలు విశ్వక్ సేన్ చనిపోయాడా? మిస్ అవుతున్నా వారందరు ఏమయిపోయారు? అనే తదితర విషయాలు తెలియాలంటే ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎలా ఉందంటే::

మన తెలుగులోనే ఇప్పటికే బ్రెయిన్ మెమోరీ ట్రాన్స్‌ఫ‌ర్ అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. ఈ కాన్సెప్ట్‌తోనే ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. బ్రెయిన్ మెమోరీ కాన్సెప్ట్‌కు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ అంశాల‌ను మేళ‌విస్తూ డైరెక్ట‌ర్ అనీష్ కురివిల్లా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఇటీవలే డ‌బుల్ ఇస్మార్ట్‌తో పాటు బిచ్చగాడు ఇలా మ‌రికొన్ని సినిమాలు తెరకెక్కాయి. అయితే, ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష సిరీస్‌ కు మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను డైరెక్టర్ అనీష్ జోడించడంతో ప్రేక్షకులకు థ్రిల్ ను ఇచ్చాయి.

అలాగే ఐలాండ్ కి వచ్చిన మనుషులు ఒక్కొక్కరిగా మిస్సవ్వడం, వాటి వెనుక కొనసాగించే సస్పెన్స్ ను చివరి వరకు హోల్డ్ చేయడం అందరిని ఆకట్టుకుంటోంది. ప్ర‌తి క్యారెక్ట‌ర్ వెనుక ఓ తెలియ‌ని కోణాన్ని చూపించిన తీరు బాగుంది. అనీష్ మేకింగ్‌తో పాటు సస్పెన్స్ హోల్డ్ చేయడం మెప్పిస్తుంది. ఫస్ట్ ఆరు ఎపిసోడ్స్ లో పలు రకాల ప్రశ్నలు రేకెత్తించగా.. చివరి రెండు ఎపిసోడ్స్ తో ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చాడు. అయితే, ఈ సిరీస్ లో చాలా రకాల పాత్రలు ఉండటంతో కాస్తా లాగ్ అనే ఫీలింగ్ అనిపిస్తోంది.  

ది మిస్ట‌రీ ఆఫ్ మోక్షఐలాండ్: 

ఈ హార‌ర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు సంజీవ్ రాయ్ కథను అందించారు. డైరెక్టర్ అనీష్ కురువిల్ల సీతారామం, మేజర్, ఎం. ఎస్. ధోనీ బయోపిక్ వంటి పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక డైరెక్టర్గా ఆవకాయ్ బిర్యానీ,కో అంటే కోటి, గాడ్స్ ఆఫ్ ధర్మపురి - జీ 5 ఒరిజినల్స్ లేటెస్ట్ గా ది మిస్ట‌రీ ఆఫ్ మోక్షఐలాండ్ సినిమాలు చేశాడు.