కెనడా తర్వాత పీఎంగా..ఇండియన్ ఆరిజన్ అనితా ఆనంద్! ఎవరీమె..ఫుల్ డిటెయిల్స్

కెనడా తర్వాత పీఎంగా..ఇండియన్ ఆరిజన్ అనితా ఆనంద్! ఎవరీమె..ఫుల్ డిటెయిల్స్

కెనడా ప్రధానిపదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే..2025లో కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో ట్రూడో రాజీనామా చర్చనీయాంశమైంది. ట్రూడో రాజీనామాతో కెనడా తర్వాతి ప్రధాని ఎవరు అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని రేసులో భారతీయ సంతతికి చెందిన మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.. ఆమె ప్రస్తుతం మంత్రివర్గంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. 

జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన తర్వాత తదుపరి కెనడా ప్రధాని ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ట్రూడో ప్రకటన తరువాత కెనడా ప్రధాన మంత్రిగా ఎవరిని నియమిస్తారనే ఊహాగానాలకు దారితీసింది. నివేదికల ప్రకారం..భారత సంతతి, లిబరల్ పార్టీ సీనియర్ నేత అనితా ఆనంద్ మొదటి వరుసలో ఉన్నారు.

ALSO READ : కెనడా అమెరికాలో కలిసి పోవాలి.. డొనాల్డ్ ట్రంప్

ఎవరీ అనితా ఆనంద్.. 

అనితా ఆనంద్ ప్రస్తుత కెనడార వాణా,అంతర్గత వాణిజ్య మంత్రి గా పనిచేస్తున్నారు. కెనడియన్ ప్రభుత్వ వెబ్ సైట్ ప్రకారం.. అనితా ఆనంద్ ఇండియన్ ఆరిజిన్.. గ్రామీణ నోవా స్కోటియాలో పుట్టి పెరిగిన మంత్రి ఆనంద్ 1985లో అంటారియోకు వెళ్లారు.కెనడాకు చెందిన జాన్ ను పెళ్లి చేసుకున్నారు..వారికి నలుగురు పిల్లలు. ప్రస్తుతం అనితా ఆనంద్  అధికార లిబరల్ పార్టీ కీ రోల్ పోషిస్తున్నారు.