ఘనంగా సేవాలాల్ బంజారా సంఘం వార్షికోత్సవం

ఘనంగా సేవాలాల్ బంజారా సంఘం వార్షికోత్సవం

ముషీరాబాద్, వెలుగు : సేవాలాల్ బంజారా సంఘం 10వ వార్షికోత్సవ మహాసభ ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  కె. గాంధీ నాయక్ మాట్లాడుతూ..  బంజారాల గోర్ బోలి భాషను అధికారిక భాషగా గుర్తించాలని డిమాండ్​చేశారు. ఫిబ్రవరి 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు.  డాక్టర్ రాజన్న, సలహాదారు వెంకటేశ్, చందు నాయక్, చక్రీ బాయి, దేవీలాల్ పాల్గొన్నారు.