Bahishkarana OTT Release Date: మిస్టరీ థ్రిల్లర్ బహిష్కరణ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వేశ్య పాత్రలో అంజలి

Bahishkarana OTT Release Date: మిస్టరీ థ్రిల్లర్ బహిష్కరణ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వేశ్య పాత్రలో అంజలి

 

హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా చేస్తూనే పలు చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంటుంది అంజలి. తాజాగా ఆమె ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ' (Bahishkarana) స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్.ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రముఖ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూలై 19న స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రేమ, మోసం, ప్రతీకారంతో ఉత్కంఠగా సాగే సన్నివేశాలతో ఈ సిరీస్ వస్తోందంటూ జీ5 వెల్లడించింది. 

ముఖేష్ ప్రజాపతి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ప్రశాంతి మలిశెట్టి  నిర్మిస్తున్న ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ విలేజ్ రివేంజ్ డ్రామాగా రాబోతుంది.ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇటివలే బహిష్కరణ నుండి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో చేతిలో వేట కొడవలి పట్టుకుని, మంటల్లో కాలిపోతున్న కుర్చీ మధ్యన..కోపంగా కూర్చున్న అంజలి ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్ చేస్తోంది.ఇందులో పుష్ప అనే వేశ్య పాత్రలో అంజలి కనిపిస్తోంది. ఈ సిరీస్ లో రవీంద్ర విజయ్,శ్రీతేజ్,అనన్య నాగళ్ల,షణ్ముక్,చైతన్య సాగిరాజు,మహ్మద్ బాషా,బేబీ చైత్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

బహిష్కరణ స్టోరీ లైన్:

బహిష్కరణ సిరీస్ 1990ల గుంటూరు రూరల్ రివేంజ్ డ్రామాగా రాబోతుంది. పెద్దపల్లి గ్రామంలో పనికి వెళ్లిన దర్శి అనే ఓ వ్యక్తి ఓ రోజు ఇంటికి తిరిగిరాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలోనే..ఓ రహస్యమైన గతం ఉన్న పుష్ప అనే వేశ్య,దర్శి,అతడి భార్య లక్ష్మి మధ్య ఉన్న అక్రమ సంబంధాలు బయటికి వస్తాయి. ఇక వెనువెంటనే రహస్యాలు క్రమంగా బయపడతాయి. ఈ క్రమంలో ప్రేమ,మోసం,కొన్ని విషాదాలతో కూడిన మలుపులు ఇలా ఈ సిరీస్ స్టోరీ సాగుతుంది.ఆ గ్రామ సర్పంచ్ శివయ్య కూడా ఈ కథలో కీలక పాత్రగా మారుతాడు. దీంతో పుష్ప, లక్ష్మి తమకు అన్యాయం జరిగిందని ఓ దశలో గుర్తించి..సమాజంలో నెలకోన్న కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది..గతంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి..సవాళ్లను పుష్ప,లక్ష్మి ఎలా ఎదుర్కొన్నారనేదే బహిష్కరణ ప్రధాన స్టోరీగా సాగనుంది.