గేమ్ చేంజర్ నా ఆలోచననే మార్చేసింది : అంజలి

గేమ్ చేంజర్  నా ఆలోచననే మార్చేసింది : అంజలి

గేమ్ చేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ మూవీ అవుతుందని చెప్పింది అంజలి. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అంజలి ఇలా ముచ్చటించింది.  ఈ సంక్రాంతి నాకు చాలా స్పెషల్.  తెలుగులో  ‘గేమ్ చేంజర్’, తమిళంలో విశాల్ చిత్రం ‘మదగజరాజా’ రాబోతోంది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. శంకర్ గారు  ‘గేమ్ చేంజర్‌‌‌‌‌‌‌‌’‌‌‌‌‌‌‌‌లో నా పాత్ర గురించి చెప్పినప్పుడు ఎక్సయిట్ అయ్యా. ఇందులో  నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా అదే కావడంతో కథ విన్నప్పుడు అమ్మే గుర్తొచ్చింది.

 పార్వతి పాత్రలో ఓ సోల్ ఉంటుంది. ఎక్కువగా రివీల్ చేయొద్దనే ట్రైలర్, టీజర్‌‌‌‌‌‌‌‌లో తక్కువ షాట్స్ పెట్టారు. తెరపై చూసినప్పుడు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు.  రామ్ చరణ్ గారు తన కో స్టార్స్‌‌‌‌‌‌‌‌కు కంఫర్ట్ ఇస్తారు.  అందరితోనూ చక్కగా మాట్లాడతారు. ఆయన పోషించిన అప్పన్న పాత్రకు నేను జోడీగా నటించా.  అప్పన్న, పార్వతిల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. మా ఇద్దరి మధ్య వచ్చే పాట గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇక శంకర్ గారు, మణిరత్నం గారి చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. 

ALSO READ : గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా.. పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేశాం : దిల్ రాజు

నాకు శంకర్ గారి చిత్రంలో చాన్స్ రావడం హ్యాపీ. ‘గేమ్ చేంజర్’ చిత్రం వల్ల  నా ఆలోచనా ధోరణి మారింది. ఈ ప్రయాణంలో నన్ను నేను ఎంతో మార్చుకున్నా.  ఇక నెక్స్ట్ ఎంచుకునే పాత్రలు, సినిమాల విషయంలోనూ  జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఒక విధంగా నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ సినిమా ‘గేమ్ చేంజర్’ అని చెప్పొచ్చు. చిరంజీవి గారు సినిమా చూసి నా పాత్రను మెచ్చుకున్నారని తెలిసింది. అదే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది.  దిల్ రాజు గారి నిర్మాణంలో నాకు ఎప్పుడూ గొప్ప చిత్రాలే వచ్చాయి. సీతమ్మ వాకిట్లో, వకీల్ సాబ్ ఇలా అన్నీ  మంచి చిత్రాలే వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతోంది’’.