కొత్తపల్లి మున్సిపల్‌‌‌‌‌‌వైస్ చైర్​పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అంజలి

కొత్తపల్లి మున్సిపల్‌‌‌‌‌‌వైస్ చైర్​పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అంజలి

కొత్తపల్లి, వెలుగు : కొత్తపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్ చైర్​పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నాలుగోవార్డు కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేరిపోతుల అంజలిని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో కౌన్సిలర్లు అంజలికి పూర్తి మద్దతు ప్రకటించడంతో ఆమె వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైనట్లు ఆర్డీవో మహేశ్వర్​ ప్రకటించారు. ఇదివరకు వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న రెండో వార్డు కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ రాధ మరణించడంతో  అధికారులు ఎన్నికలు నిర్వహించారు.

12 మంది కౌన్సిలర్లు కు ఒక కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మరణించడంతో 11 మంది కౌన్సిలర్లు ప్రస్తుతం కొనసాగుతున్నారు. వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్నికకు ఏడుగురు కౌన్సిలర్లు హాజరుకాగా కోరం సరిపోవడంతో ఎన్నిక నిర్వహించారు.  అంజలి మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు ఎండీ జమీలుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.