
కేసీఆర్ ఆనాడు పాస్ పోర్టు బ్రోకర్ అయితే.. ఇప్పుడు కౌశిక్ రెడ్డి రాజకీయ బ్రోకర్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్. పదవుల కోసం కౌశిక్ రెడ్డి ఇప్పటికే మూడు పార్టీలు మార్చాడాని విమర్శించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధికి ఆటంకాలు సృష్టించినప్పుడు, ప్రజాస్వామ్యం పై దాడి జరిగినప్పుడు పొన్నం ఆవేశం స్టార్ అవుతారు తప్పేంటని ప్రశ్ని్ంచారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ పై.. తెలంగాణ ఉద్యమ ద్రోహి అయినటువంటి కౌశిక్ రెడ్డిని ఉసిగొల్పారని ఆరోపించారు.