యాదవులను రేవంత్​ కించపరచలేదు.. తలసాని కామెంట్లపై మాత్రమే స్పందించారు : అంజన్​ కుమార్​

యాదవులను రేవంత్​ కించపరచలేదు.. తలసాని కామెంట్లపై మాత్రమే స్పందించారు : అంజన్​ కుమార్​

యాదవులను రేవంత్​ కించపరచలేదు
తలసాని కామెంట్లపై మాత్రమే స్పందించారు : అంజన్​ కుమార్​
కాంగ్రెస్​ను చూసి బీఆర్​ఎస్​  భయపడుతున్నది : మల్లు రవి
గాంధీభవన్​ జోలికొస్తే.. తెలంగాణ భవన్​ను పేల్చేస్తం : అద్దంకి దయాకర్​

హైదరాబాద్, వెలుగు : పీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డి యాదవులను కించపరచలేదని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అంజన్​ కుమార్​ యాదవ్​ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​చేసిన కామెంట్లకు రేవంత్​ జవాబిచ్చారే తప్ప.. యాదవుల గురించి కామెంట్​ చేయలేదని చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్​యాదవే.. పీసీసీ చీఫ్ ను​పిసికేస్తామంటూ కామెంట్లు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్​ లేరని, రాష్ట్రం కోసం తాము యుద్ధం చేశామని, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని ఆయన చెప్పారు.

ప్రియాంకా గాంధీని పొలిటికల్​ టూరిస్ట్​ అనడం కేటీఆర్​ దురహంకారానికి నిదర్శనమన్నారు.  గాంధీభవన్​ జోలికొస్తే ఖబడ్దార్​అని హెచ్చరించారు. ప్రియాంకా గాంధీ సభ తర్వాత కాంగ్రెస్​కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్​నేతలు భయపడుతున్నారని పీసీసీ సీనియర్​ వైస్​ప్రెసిడెంట్​మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్​తో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నది పొలిటికల్​ టూరిజమేనా అని ప్రశ్నించారు. తలసాని తలపొగరు మాటలకు రేవంత్​ ఇచ్చిన రిప్లైని యాదవులకు అంటగట్టి కుల రాజకీయాలకు తెర లేపారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్​ అయ్యారు. తలసాని తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇక నుంచి తలసానిని తలమాసిన శ్రీనివాస్​ యాదవ్​ అని పిలుస్తామని మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్​అన్నారు.