కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం జై శ్రీరాం నినాదాలతో మారుమోగింది. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి, పంచామృతాలతో అభిషేకం చేశారు. హనుమాన్ మాలధారులు తెల్లవారుజామునే ఆలయానికి చేసుకొని మాలవిరమణ చేశారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయంతి ఉత్సవాల సందర్భంగా సుమారు 50 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం బొజ్జ పోతన దగ్గర గల పార్కింగ్ స్థలం నుంచి గుట్టపైకి ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు.