హస్సేనాబాద్ గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

 మోతె (మునగాల), వెలుగు : మోతె మండలం హస్సేనాబాద్ గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ గురువారం ఘనంగా జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు  స్వామివారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో  టీఎస్పీఎస్సీ చైర్మన్, మాజీ డీజీపీ  మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే  మల్లయ్య యాదవ్, మోతే ఎంపీపీ ముప్పాని ఆశ, జడ్పీటీసీ   పందేలపల్లి పుల్లారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 కాశీ విశ్వేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ  

నల్గొండ అర్బన్​:  పట్టణంలోని శ్రీకృష్ణదేవాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ గురువారం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం  బాల బ్రహ్మానంద శర్మ ఆధ్వర్యంలో కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి కల్యాణం జరిగింది.  ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేశ్​ గౌడ్, కౌన్సిలర్లు,  ఆలయ కమిటీ సభ్యులు  ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం  భక్తులకు అన్నదానం నిర్వహించారు.