అంజనీపుత్ర ఛైర్మన్ బర్త్ డే..మూడు వేల మందితో రక్తదానం

మంచిర్యాల, వెలుగు : అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ బర్త్ డే వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎండీ పిల్లి రవి ఆధ్వర్యంలో 3వేల మందితో రక్తదానం చేశారు. సంస్థ సిబ్బంది ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

చీఫ్​గెస్ట్​గా పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, పలువురు వక్తలు మాట్లాడుతూ.. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న గుర్రాల శ్రీధర్ సేవలు సమాజానికి ఎంతో ఉపయోగకరణమన్నారు. అంజనీపుత్ర ఎగ్జిక్యూటవ్ డైరెక్టర్లు సంతోష్, కిషన్ పాల్గొన్నారు.