వండర్ బుక్ ఆఫ్ ​రికార్డ్స్​లో అంజనీపుత్రకు చోటు

వండర్ బుక్ ఆఫ్ ​రికార్డ్స్​లో అంజనీపుత్రకు చోటు

మంచిర్యాల, వెలుగు: నాలుగు లక్షల శ్రీగంధం చెట్లు నాటిన మంచిర్యాలలోని అంజనీపుత్ర ఎస్టేట్స్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్​వీఆర్ గార్డెన్​లో జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్​​ఇండియా కో-ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ చేతుల మీదుగా అంజనీపుత్ర ఫౌండర్, చైర్మన్ గుర్రాల శ్రీధర్ అవార్డును అందుకున్నారు. 

అంజనీపుత్ర ఎస్టేట్స్ శ్రీగంధం చెట్ల పెంపకంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2017లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 350 ఎకరాల్లో 4 లక్షల శ్రీగంధం చెట్లు నాటి రికార్డు సృష్టించింది. కార్యక్రమంలో అంజనీపుత్ర మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి, ఎగ్జిక్యూటివ్ ​డైరెక్టర్లు, డైరెక్టర్లు, వండర్ ​బుక్​ తెలంగాణ ప్రతినిధులు అరుణ్ కుమార్, తగరపు శంకర్ పాల్గొన్నారు.