మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ రియల్ఎస్టేట్సంస్థ అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 'బెస్ట్రియల్ఎస్టేట్మార్కెటింగ్కంపెనీ' అవార్డు లభించింది. స్విఫ్ట్అండ్లిఫ్ట్మీడియా అండ్టెక్ ఎల్ఎల్పీ ప్రతి ఏటా వివిధ రంగాల్లో అసాధారణ సేవలందిస్తున్న సంస్థలకు తెలంగాణ బిజినెస్ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేస్తోంది.
2024 సంవత్సరానికి గానూ బెస్ట్రియల్ఎస్టేట్మార్కె టింగ్కంపెనీగా అంజనీపుత్ర ఎస్టేట్స్ను ఎంపిక చేసింది. సోమవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ఫౌండర్అండ్సీఈవో నీలేశ్సాబే, సినీ నటి భూమికా చావ్లా చేతుల మీదుగా అంజనీపుత్ర ఎస్టేట్స్చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి, డైరెక్టర్లు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ఏజెంట్లకు, కస్టమర్లకు గుర్రాల శ్రీధర్కృతజ్ఞతలు తెలిపారు.