హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఇటీవల మోమోస్ తిని మహిళ చనిపోయిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. చింతల్ బస్తీలో మోమోస్ తయారు చేసినట్లు గుర్తించిన పోలీసులు బీహార్ కి చెందిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అపరిశుభ్రత, నాసిరకం పదార్థాలతో మోమోస్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.. మోమోస్, మయోనైస్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.
అక్టోబర్ 27న బంజారాహిల్స్లోని నందినగర్లో వారంతపు సంతలో మోమోస్ మోస్ తిని ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు లోనై చికిత్స పొందుతూ చనిపోయింది. మరో 20 మందికి పైగా అస్వస్థతకు లోనవడం స్థానికంగా కలకలం రేపింది. మృతి చెందిన మహిళను సింగాడికుంటకు చెందిన 29 ఏళ్ల మహిళ రేష్మగా గుర్తించారు. ఈమెకు ముగ్గురు సంతానం. రేష్మ బేగం చనిపోవడానికి కల్తీ మోమోస్ కారణమంటూ కంప్లెయింట్ చేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఇప్పటికే మోమోస్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు చింతల్ లో కల్తీ మోమోస్ తయారు చేస్తున్నట్లు గుర్తించి ఆరుగురిని అరెస్ట్ చేశారు.