షాద్ నగర్ కోర్టు ఏజీపీగా అంజయ్య యాదవ్

షాద్ నగర్ కోర్టు ఏజీపీగా అంజయ్య యాదవ్

షాద్ నగర్,వెలుగు : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్  ( (ఏజీపీ)గా  సీనియర్ న్యాయవాది బి.అంజయ్య యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  జిల్లాలోని వివిధ కోర్టులకు 6 మందిని ఎంపిక చేసి ప్రకటించింది.

 షాద్ నగర్ కోర్టు లో సీనియర్ న్యాయవాదిగా 1992 నుంచి అంజయ్య యాదవ్ సేవలందిస్తుండడమే కాకుండా... ఎన్నో సామాజిక సేవల్లోనూ పాల్గొన్నారు. ఆయన కొంతకాలం జర్నలిస్టుగానూ పనిచేశారు.  బీసీ సంక్షేమ సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగానూ ఆయన గతంలో సేవలు అందించారు.  తనను అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.