
ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి గెలుపొందారు. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీఎస్సీ నుంచి ప్రసన్న హరికృష్ణ పోటీ చేశారు.
మొదటి నుంచి ఉత్కంఠ రేపిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం బుధవారం (మార్చి 5) సాయంత్రానికి కొలిక్కి వచ్చింది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ను ఎలిమినేట్ చేసి ఆయన సాధించిన ఓట్ల నుంచి రెండో ప్రయారిటీ ఓట్లను వేరుచేసి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు పంచారు కౌంటింగ్ అధికారులు. దీంతో రెండో ప్రాధాన్యతఓట్లతో బీజేపీ బలపర్చిన అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు.