బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా యంగ్ రెజ్లర్స్ అంజు, హర్షిత సిల్వర్ మెడల్స్‌ను సాధించారు. ఆదివారం జరిగిన విమెన్స్ 53 కేజీ ఫైనల్ బౌట్‌లో అంజు 0–10తో జి హయాంగ్ కిమ్ (కొరియా) చేతిలో ఓడి రెండో ప్లేస్‌లో నిలిచింది. సెమీస్ వరకు నిలకడగా విజయాలు సాధించిన ఇండియన్ రెజ్లర్ ఫైనల్ ఫైట్‌లో మాత్రం సత్తా చాటలేకపోయింది.
సెమీస్‌లో 9–6తో చున్ లీ (చైనా)ను ఓడించి ఫైనల్‌కు వెళ్లింది. విమెన్స్ 72 కేజీ ఫైనల్లో హర్షిత 2–5తో క్వియాన్ జియాంగ్ (చైనా)తో ఓటమిపాలైంది. 62 కేజీ బ్రాంజ్ మెడల్ బౌట్‌లో మనీషా 5–0తో ఎరియన్ గెరాలిన్ కార్పియో (కొలంబియా)పై గెలవగా, 65 కేజీల్లో అంతిమ్ కుండుకు మెడల్ లభించింది. అయితే 57 కేజీల్లో సరితా మోరె క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. 4–8తో గంటుయా ఎంకబాట్ (మంగోలియా) చేతిలో ఓడింది.