
బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన అంకం సతీశ్ (38)కు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో కరీంనగర్ లైఫ్ లైన్ హాస్పిటల్లో సర్జరీ చేశారు. ఇతడికి గతంలో హార్ట్ సర్జరీ జరిగిందని ప్రస్తుతం సతీశ్ కోమాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చయ్యాయని సతీశ్ ట్రీట్మెంట్కోసం దాతలు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. అతడికి తల్లి, భార్య, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారన్నారు. కొమర వెంకటేశ్ 9550623763, గూడూరు రవీందర్ 944192027 నెంబర్లకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.