అనకాపల్లి ఫార్మాలో పేలిన రియాక్టర్లు : 18 మందికి తీవ్ర గాయాలు

అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.   అచ్యుతాపురం సెజ్ లోని ఓ కెమికల్​ ఫ్యాక్టరీ లో రియాక్టర్​ పేలి భారీ అగ్నిప్రమాదం సభవించింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. 18 మందికి గాయాలయ్యాయి.  క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి  తరలించారు. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లో పొగ అలుముకోవడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అనకాపల్లి ఎస్పీ, కలెక్టర్​ ఘటనా స్థలానికి చేరుకుని  ప్రమాద ఘటనపై ఆరాతీస్తున్నారు.  మధ్యాహ్నం లంచ్​ సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. 

Also Read :- శనివారం ఇలా చేయండి...  జాతకంలో దోషాలు తొలగుతాయి

ఎసెన్సియా కెమికల్ ఫ్యాక్టరి ప్రమాదంపై హోంమంత్రి అనిత  స్పందించారు.  అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి... ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. .