
- బోధన్ మున్సిపల్ ప్రత్యేకాధికారి అదనపు కలెక్టర్ అంకిత్
బోధన్,వెలుగు: మున్సిపల్ అధికారులు సిబ్బంది తాగునీటి, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. మంగళవారం బోధన్ మున్సిపల్ ప్రత్యేకాధికారి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. పట్టణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటిని ప్రతికాలనీకి వచ్చే విధంగా నీటి సరఫరా చేయాలన్నారు.
పట్టణం అభివృద్ధి చెందాలంటే వందశాతం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బోధన్ పట్టణ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులను , వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పరిశీలించారు. కూరగాయలు, వంటసామగ్రి పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. మెనూ ప్రకారం భోజనం, కూరలు అందించాలన్నారు. అనంతరం పట్ణణ శివారులోని డంపింగ్ యార్డును పరిశీలించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.