ఒలింపిక్స్ లో భారత ఆర్చరీ టీం సత్తా చాటింది. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ రౌండ్ 16లో అంకితా భగత్, ధీరజ్ బొమ్మదేవర ఘన విజయం సాధించారు. ఇండోనేషియా జోడీ ఆరిఫ్ పంగేస్తు, దియానందా చోయిరునిసాపై 5-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. దీంతో ఈ విభాగంలో భారత పతకం ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించింది.గెలిచిన అన్ని పతకాలు కాంస్య పతకాలు కావడం గమనార్హం.
మహిళల విభాగంలో అదే విధంగా మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లలో రెండు కాంస్య పతకాలను గెలుచుకున్న మను భాకర్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. మూడో పతకం లక్యంగా పెట్టుకున్న ఈమె.. ఈ విభాగంలోనూ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించనుంది. బ్యాడ్మింటన్ విషయానికి వస్తే లక్ష్య సేన్ మాత్రమే పతకం రేస్ లో ఉన్నాడు.