భోపాల్‌కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ లవర్ కోసం ఫుడ్ ఆర్డర్ చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. అయితే ఇందులో ఆశ్చర్యమేమిటని అనుకుంటున్నారా.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆమె ఫుడ్ ఆర్డర్ చేయడంలో ఎలాంటి వింత, ఆశ్చర్యం లేకపోవచ్చు. కానీ ఆ తర్వాత జొమాటో ఇచ్చిన ట్విస్టే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతకీ ఏమైందంటే..
భోపాల్‌కు చెందిన అంకిత తన మాజీ బాయ్ ఫ్రెండ్ కోసం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆమె ఆర్డర్ ను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టింది. అంటే డెలివరీ అయిన తర్వాత ఆ అమౌంట్ ను అతనే చెల్లించాలి. దీంతో అతను ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ చేయాలని చెప్పాడు. ఇలా ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు అంకిత.. ఇలా అతనికి ఫుడ్ ఆర్డర్ పెట్టింది.
ALSO READ:దేశం షాక్ : 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత బొగ్గుల కొలిమిలో కాల్చేశారు..
దీంతో ఏకంగా జొమాటోనే జోక్యం చేసుకుంది. "భోపాల్‌కు చెందిన అంకితా దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీపై ఆహారం పంపడం ఆపివేయండి. ఇది 3వ సారి - అతను చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు" అని ట్వీట్ చేసింది. దాంతో పాటు "దయచేసి ఎవరైనా అంకితా ఖాతాలో COD బ్లాక్ చేయబడిందని చెప్పండి - ఆమె 15 నిమిషాలకు ఒకసారి మళ్లీ ప్రయత్నిస్తోంది" అని రాసుకువచ్చింది. ఈ ట్వీట్స్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఈ విషయంపై పలు రకాలుగా స్పందించడం మొదలుపెట్టారు.
"అతను చెల్లించే వరకు పంపుతూ ఉండండి" అని అంకిత సమాధానం ఇవ్వడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఫుడ్-లవ్ స్టోరీ ట్వీట్‌లను చూసిన కొంతమంది.. "Hy @zomato.. ఈ అర్ధంలేని పనిని ఆపమని నేను ఆమెను ఒప్పిస్తాను" అంటూ చమత్కారమైన కామెంట్లు పెడుతున్నారు.
Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time - he is refusing to pay!
— zomato (@zomato) August 2, 2023