సీఎం కేసీఆర్ మనసు మారి.. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏఎన్ఎంలు వరలక్ష్మీ వ్రతం చేశారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ జగిత్యాల జిల్లాలో వినూత్న రీతిలో ఏఎన్ఎంలు నిరసన వ్యక్తం చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆర్డీవో ఆఫీస్ ముందు దీక్ష శిబిరంలో పూజలు చేశారు.
పది రోజుల నుంచి రోజుకో రూపంలో ప్రభుత్వానికి తమ గోడును వినిపిస్తు వస్తున్న ఏఎన్ఎంలు శుక్రవారం(ఆగస్టు 25) వినూత్నంగా నిరసనను వ్యక్తం చేశారు.
మరికొందరు ఏఎన్ఎంలు పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్ లను చదివారు. ఏఎన్ఎంల విషయంలో సీఎం కేసీఆర్ మనసు మారాలని ప్రత్యేక పూజలు చేసినట్లు వారు తెలిపారు. ప్రతీ సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఇంట్లో పూజలు చేసుకునే వాళ్లమని.. కానీ ఈ సంవత్సరం ఇలా దీక్షా శిబిరంలో మొక్కులు చెల్లించుకోవడం బాధాకరంగా ఉందని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మనసు మారి తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని లక్ష్మీ దేవిని వేడుకున్నామని వారు తెలిపారు.