గువాహతి: ఇండియా యంగ్ షట్లర్ అన్మోల్ ఖర్బ్ సంచలనం సృష్టించింది. గువాహతి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌చాంపియన్ లలిన్రాత్ చైవాన్‌కు షాకిస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో అన్మోల్ 21–13, 22–24, 22–20తో లలిన్రాత్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో మాన్సి సింగ్ 20–22, 18–21తో కాటెక్లెంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. మెన్స్ సింగిల్స్‌లో మూడో సీడ్ సతీశ్ కుమార్ 21–19, 21–13తో సరన్ జంస్రి (థాయ్‌లాండ్)పై నెగ్గి సెమీస్ చేరాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఐదో సీడ్ ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, విమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా జంటలు సెమీస్‌లో అడుగు పెట్టాయి.