![అధికార దాహమే కేజ్రీవాల్ ఓటమికి కారణం: అన్నా హజారే](https://static.v6velugu.com/uploads/2025/02/anna-hazares-key-comments-on-delhi-assembly-election-results_juqOrGB5vT.jpg)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార ఆప్ పార్టీకి వ్యతిరేకంగా వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే అధిక్యంలో మేజిక్ ఫిగర్ (36 సీట్లు) దాటేసిన కమలం పార్టీ.. భారీ లీడ్ దిశగా పయనిస్తోంది. దీంతో అధికార ఆప్‌కు ఈ సారి షాక్ తగిలే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ గురువు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం (ఫిబ్రవరి 8) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారని విమర్శించారు.
ALSO READ | ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం ఎవరు..? క్లారిటీ ఇచ్చిన వీరేంద్ర సచ్‌దేవా
అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని.. లిక్కర్ స్కామ్‌తో అతడు అప్రతిష్ఠపాలయ్యారని అన్నారు. ఆప్ సర్కార్ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని.. అందుకే ప్రజలు కేజ్రీవాల్‌ను ఓడించారన్నారు. అవినీతి జోలికి వెళ్లొద్దని కేజ్రీవాల్ కు చెప్పానని.. కానీ అతడి వినిపించుకోలేదని విమర్శించారు. ఇక, ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 42, ఆప్ 28 చోట్ల అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అవసరం.