పార్టీ చీఫ్ పదవికి అన్నామలై గుడ్ బై

పార్టీ చీఫ్ పదవికి అన్నామలై గుడ్ బై

చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి రేసులో తాను లేనని తెలిపారు. కోయంబత్తూరులో అన్నామలై మీడియాతో మాట్లాడారు. ‘‘తమిళనాడు బీజేపీలో నాయకత్వం కోసం నేతలు పోటీ పడరు. మేమంతా ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకుంటాం. నేను ఆ పదవి రేసులో లేను. పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ పార్టీ బాగుండాలని పరితపించే వ్యక్తిని నేను. రాజకీయ ఊహాగానాలపై నేను స్పందించను. తదుపరి అధ్యక్షుడి రేసులో లేను’’ అని పేర్కొన్నారు. 

2026లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు కళ్లెం వేయాలని బీజేపీ డిసైడ్ అయింది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామితో అమిత్ షా భేటీ అయ్యి చర్చలు జరిపారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు అంగీకరించిన పళనిస్వామి తమిళనాడులో అన్నామలైని పదవి నుంచి తొలగించాలని కోరినట్లు సమాచారం.