AP News: అన్నమయ్య జిల్లాల్లో కూంబింగ్​.. ఎర్రచందనం స్మగ్లర్​ అరెస్ట్​

AP News: అన్నమయ్య జిల్లాల్లో కూంబింగ్​.. ఎర్రచందనం స్మగ్లర్​ అరెస్ట్​

అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు టాస్క్​ ఫోర్స్​ పోలీసులు.  అక్రమంగా తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ సానిపాయ రేంజిలోని వీరబల్లి ఫారెస్టు బీటు పరిధిలో RSASTF సిబ్బంది కూంబింగ్​ చేస్తున్నారు.  రాయచోటి–గడికోట మార్గంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.  అటుగా వెళ్తున్న కారు పోలీసులు ఆపినా.. ఆపలేదు.  దీంతో టాస్క్ ఫోర్సు పోలీసులు వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు.  కారులోని వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.  కారులో ఉన్న నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనుకు తరలించారు.   డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ | వైసీపీ నేతను ముంబై లో అరెస్ట్​ చేసిన కడప పోలీసులు..

ఈ కూంబింగ్​  ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్  ఎల్. సుబ్బారాయుడు   , టాస్క్ ఫోర్సు ఎస్పీ  పీ. శ్రీనివాస్  అధ్వర్యంలో డీఎస్పీ శ్రీ బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్,  ఆర్ఎస్ఐ సి. వినోద్ కుమార్ టీమ్ శనివారం ( ఏప్రిల్​5)  అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ సానిపాయ రేంజిలోని వీరబల్లి ఫారెస్టు బీటు పరిధిలో స్థానిక ఎఫ్బీఓ జి. అనిల్ కుమార్ తో కలసి కూంబింగ్ చేపట్టారు.